AP Corona Cases: ఏపీలో కొత్తగా 18,561 కేసులు.. ఒక్కరోజులో 109 మంది మృతి

AP Corona Cases: ఏపీలో క‌రోనా వైర‌స్ మరణమృదంగం మోగిస్తుంది.

Venkata Chari
Updated on: 17 May 2021 5:54 PM IST
18561 New Coronavirus Cases Reported in Andhra Pradesh Today 17-05-2021
X

ఏపీలో కరోనా కేసులు (ఫొటో ట్విట్టర్)

AP Corona Cases: ఏపీలో క‌రోనా వైర‌స్ మరణమృదంగం మోగిస్తుంది. రోజురోజుకు క‌రోనా బారిన పడే వారి సంఖ్య పెరిగిపోతుంది. మ‌ర‌ణాల సంఖ్య వంద మార్క్ దాటింది. గత 24 గంటల్లో ఏపీలో 73,749 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 18,561 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కరోనా వైరస్‌తో ఈ రోజు 109 మంది మరణించారు. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 16 మంది మృతి చెంద‌గా., అనంతపూర్ జిల్లాలో 10 మంది, చిత్తూరు జిల్లాలో 10 మంది మ‌ర‌ణించారు. ఇతర జిల్లాల్లోనూ కరోనా మరణాలు భారీగానే నమోదవుతున్నాయి. ఇప్పటివవరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 9,481కి పెరిగింది.

ఏపీలో ఇప్పటివరకు 14,51,157 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 12,30,122 మంది కోలుకున్నారు. ఇంకా 2,11,554 మంది చికిత్స పొందుతున్నారు. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 3,152 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 1,621 కేసులు, అనంతపురం జిల్లాలో 2,094, పశ్చిమ గోదావరి జిల్లాలో 1,185 కేసులు, విశాఖ జిల్లాలో 2,098 కేసులు గుర్తించారు.


Venkata Chari

Venkata Chari

Next Story