AP Corona Cases: ఏపీలో కొత్తగా 18,285 కోవిడ్ కేసులు

AP Corona Cases: ఏపీలో కోవిడ్ కేసులు మరలా పెరుగుతున్నాయి. కొత్తగా రాష్ట్రంలో 18వేల 285 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.

Venkata Chari
Published on: 26 May 2021 6:36 PM IST
18285 ‍New Coronavirus cases Reported in Andhra Pradesh Today 26 05 2021
X

కరోనా వైరస్ (ఫొటో ట్విట్టర్)

AP Corona Cases: ఏపీలో కోవిడ్ కేసులు గత రెండు రోజులుగా తగ్గుముఖం పట్టాయి. కానీ, నేడు మరలా ఎక్కువ కేసులు నమోదవ్వడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కొత్తగా రాష్ట్రంలో 18 వేల 285 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ బారిన పడి 99 మంది మృతి చెందారు. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 16 లక్షల 27 వేల 390కు చేరగా ఇప్పటివరకు 10 వేల 427 మంది మృతి చెందినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. తాజాగా 24,105 మంది కరోనా నుంచి కోలుకున్నారని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం 1 లక్ష92 వేల 104 యాక్టివ్ కేసులున్నాయి.

గడిచిన 24 గంటల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 15 మంది కరోనా వైరస్‌ తో మృతి చెందగా, పశ్చిమగోదావరి 14, విజయనగరం 9, అనంతపురం 8, తూర్పుగోదావరి 8, నెల్లూరు 8, ప్రకాశం 8, విశాఖపట్నం 8, కర్నూలు 6, గుంటూరు 5, కృష్ణా 5, శ్రీకాకుళంలో ఐదుగురు చనిపోయారు. అలాగే తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 3296 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.


Venkata Chari

Venkata Chari

Next Story