AP Corona Cases: ఏపీలో కొత్తగా 16,167 కరోనా కేసులు

AP Corona Cases: ఏపీలో కొవిడ్ కేసులు నేడు నిన్నటి పోల్చితే తగ్గాయి. కొత్తగా 16వేల 167 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.

Venkata Chari
Updated on: 27 May 2021 6:34 PM IST
16167 ‍New Coronavirus cases Reported in Andhra Pradesh Today 27 05 2021
X

కరోనా వైరస్ (ఫొటో ట్విట్టర్)

AP Corona Cases: ఏపీలో కొత్తగా 16 వేలకు పైగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. నిన్న పెరగిన కేసులు నేడు కాస్తా తగ్గాయి. కొత్తగా రాష్ట్రంలో 16 వేల 167 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ బారిన పడి 104 మంది మృతి చెందారు. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 16 లక్షల 43 వేల 557కు చేరగా ఇప్పటివరకు 10 వేల 531 మంది మృతి చెందినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. తాజాగా 21,385 మంది కరోనా నుంచి కోలుకున్నారని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం 1 లక్ష86 వేల 728 యాక్టివ్ కేసులున్నాయి.

గడిచిన 24 గంటల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 14 మంది మృతి చెందగా, పశ్చిమగోదావరి 13, విజయనగరం 8, అనంతపురం 9, తూర్పుగోదావరి 6, నెల్లూరు 9, ప్రకాశం 7, విశాఖపట్నం 11, కర్నూలు 6, గుంటూరు 8, కృష్ణా 6, శ్రీకాకుళంలో ఆరుగురు చనిపోయారు. అలాగే నేడు చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 2967 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.


Venkata Chari

Venkata Chari

Next Story