Corona Cases in AP: రాష్ట్రంలో కొత్తగా 1,608 పాజిటివ్ కేసులు

* క్రమంగా పెరుగుతున్న యాక్టివ్ కేసుల సంఖ్య * కోవిడ్‌తో మరో ఆరుగురు మృతి * చిత్తూరు జిల్లాలో 281 కొత్త కేసులు

Sandeep Reddy
Updated on: 10 Sept 2021 6:30 PM IST
1,608 New Coronavirus Reported in Andhra Pradesh Today 10 09 2021 | Today Corona Cases in Andhra Pradesh
X

Representational Image

Corona Cases in AP: ఏపీలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తగ్గినట్టే కనిపించిన మళ్లీ యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 67 వేలకు పైగా కరోనా టెస్టులు చేస్తే వారిలో 16వందల 8 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది. కరోనాతో మరో ఆరుగురు మృతి చెందారు. అత్యధికంగా చిత్తూరులో 281, నెల్లూరులో 261, తూర్పుగోదావరిలో 213, కృష్ణాలో 161 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది..

అదే సమయంలో కరోనా నుంచి 11 వందల ఏడు మంది కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనాతో ఆరుగురు మృతి చెందారు. నెల్లూరులో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, విశాఖ, పశ్చిమగోదావరిలో ఒకరి చొప్పున మరణించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 15వేల 119 యాక్టివ్ కేసులున్నట్టు ఏపీ వైద్యారోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story