AP Corona Cases: ఏపీలో కొత్తగా 15,284 కోవిడ్ కేసులు

AP Corona Cases: ఏపీలో నేడు కొత్తగా 15వేల 284 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.

Venkata Chari
Published on: 25 May 2021 6:38 PM IST
15284 ‍New Coronavirus cases Reported in Andhra Pradesh Today 25 05 2021
X

కరోనా టెస్ట్ (ఫొటో ట్విట్టర్)

AP Corona Cases: ఏపీలో కోవిడ్ కేసులు గత రెండు రోజులుగా తగ్గుముఖం పట్టాయి. కానీ, నేడు మరలా ఎక్కువ కేసులు నమోదవ్వడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కొత్తగా రాష్ట్రంలో 15 వేల 284 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ బారిన పడి 106 మంది మృతి చెందారు. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 16 లక్షల 09 వేల 105కు చేరగా ఇప్పటివరకు 10 వేల 328 మంది మృతి చెందినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. తాజాగా 20,917 మంది కరోనా నుంచి కోలుకున్నారని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఇక తాజాగా రాష్ట్రంలో 20 వేల 917 మంది మహమ్మారి నుంచి కోలుకోగా ప్రస్తుతం 1 లక్ష98 వేల 023 యాక్టివ్ కేసులున్నాయి.

గడిచిన 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 2 వేల 663 కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 19 వందల 70 కేసులు నమోదవగా పశ్చిమ గోదావరి జిల్లాలో 14 వందల 12 కేసులు .. అనంతపురంలో 10 వందల 34.. విశాఖపట్నంలో 18 వందల 40 కొత్త కేసులొచ్చాయి. చిత్తూరులో అత్యధికంగా 15 మంది, ప్రకాశం జిల్లాలో 11 మంది, పశ్చిమగోదావరిలో 10 మంది, అనంతపురం, తూర్పుగోదావరి,నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో 9 మంది, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో 8 మంది, శ్రీకాకుళంలో ఏడుగురు, గుంటూరు, కృష్ణ జిల్లాల్లో ఐదుగురు, కడపలో ఒకరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.



Venkata Chari

Venkata Chari

Next Story