CM Jagan: 14వ రోజుకు చేరుకున్న జగన్‌ మేమంతా సిద్ధం యాత్ర

CM Jagan: నంబూరు బైపాస్‌ నుంచి ప్రారంభంకానున్న బస్సుయాత్ర

Shashank Gullapelli
Published on: 13 April 2024 8:46 AM IST
14th Day Of CM Jagan Memantha Siddham Bus Yatra
X

CM Jagan: 14వ రోజుకు చేరుకున్న జగన్‌ మేమంతా సిద్ధం యాత్ర

CM Jagan: ఏపీలో ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు వైసీపీ బాస్. ఆయన చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 14వ రోజుకు చేరుకుంది. ప్రతిపక్షాలపై కౌంటర్లు, జనాలకు చేరువయ్యే స్పీచ్‌లతో సీఎం జగన్ ముందుకెళ్తున్నారు. ఇవాళ గుంటూరు జిల్లా నంబూరు బైపాస్ నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభంకానుంది. కాజా, మంగళగిరి బైపాస్, సీకే కన్వెన్షన్ మీదుగా బస్సు యాత్ర కొనసాగనుంది. బస్సు యాత్రలో భాగంగా ఆయన ఉదయం 11 గంటలకు చేనేత కార్మికులతో ముఖాముఖిలో పాల్గొంటారు. అనంతరం కుంచనపల్లి బైపాస్ మీదుగా తాడేపల్లి బైపాస్‌కు చేరుకుని భోజనం విరామం తీసుకుంటారు. తర్వాత వారధి, శిఖామణి సెంటర్, చుట్టుగుంట, భగత్‌సింగ్ రోడ్, పైపుల రోడ్, కండ్రిక, రామవరప్పాడు, నిడమనూరు బైపాస్ మీదుగా కేసరపల్లి బైపాస్ శివారులో రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story