AP Corona Cases: ఏపీలో కొత్తగా 14,986 కరోనా కేసులు, 84 మంది మృతి

AP Corona Cases: ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Venkata Chari
Updated on: 10 May 2021 8:16 PM IST
14,986 New Coronavirus Cases Reported in Andhra Pradesh on 10 MAY 2021
X

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 14,986 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి (ఫొటో ట్విట్టర్)

AP Corona Cases: ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏపీలో కొత్తగా 14,986 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 84 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో ఏపీ ప్రభుత్వం 60,124 కరోనా పరీక్షలు చేసింది.

తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 12,99,694 మంది కరోనా వైరస్‌ బారినపడగా మరణాల సంఖ్య 8వేల791 గా ఉన్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,74,28,059 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.


Venkata Chari

Venkata Chari

Next Story