AP Corona Cases: ఏపీలో 14,792 మందికి పాజిటివ్‌.. 57 మంది మృతి

AP Corona Cases: ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 24 గంటల్లో 14 వేల 792 పాజిటివ్ కేసులు నమోదు కాగా 57 మంది మృతి చెందారు.

Venkata Chari
Published on: 29 April 2021 9:45 PM IST
14792 New Coronavirus Cases Reported in Andhra Pradesh on 29 April 2021
X

AP Corona Cases: ఏపీలో 14,792 మందికి పాజిటివ్‌.. 57 మంది మృతి

AP Corona Cases: ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 14 వేల 792 పాజిటివ్ కేసులు నమోదు కాగా 57 మంది మృతి చెందారు.

ప్రస్తుతం ఏపీలో 1,14,158 యాక్టివ్‌ కేసులున్నాయి. కరోనా నుంచి కోలుకుని 9,62,250 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఏపీలో మొత్తం 10,48,336 పాజిటివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు 7,928 మంది మృతి చెందారు.

కొవిడ్‌తో అనంతపురం 7, విజయనగరం 7, పశ్చిమ గోదావరి7, తూర్పు గోదావరిలో 6, చిత్తూరు5, విశాఖలో 5 చొప్పున ప్రాణాలు కోల్పోయారు. నెల్లూరు, శ్రీకాకుళంలో ఇద్దరు చొప్పున, కడప, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ముగ్గురు, కర్నూలులో ఇద్దరు, గుంటూరులో ఒక్కరు మృతి చెందారు.

Venkata Chari

Venkata Chari

Next Story