AP Corona Cases: ఏపీలో 14,669 మందికి పాజిటివ్‌.. 71 మంది మృతి

Samba Siva Rao
Published on: 28 April 2021 6:51 PM IST
Corona virus Cases in AP
X

కరోనా వైరస్ ప్రతీకాత్మక చిత్రం

AP Corona Cases: ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 14 వేల 669 పాజిటివ్ కేసులు నమోదు కాగా 71 మంది మృతి చెందారు. ఏపీలో గడిచిన 24గంటల్లో 74వేల 681మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా వారిలో 14వేల 669 మందికి పాజిటివ్ గా నిర్దారణ అయింది. దీంతో మొత్తం ఇప్పటి వరకు పది లక్షల 69 వేల544 మంది కరోనా భారీన పడినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ర్ట వ్యాప్తంగా ఒక కోటి 62 లక్షల 17 వేల 831 మంది నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story