Corona Cases in AP: ఏపీలో కొత్తగా 14,440 కరోనా కేసులు..

Corona Cases in AP: ఏపీలో కోవిడ్ మరింత విజృంభిస్తోంది.

Arun Chilukuri
Published on: 23 Jan 2022 6:21 PM IST
14,440 New Coronavirus Cases Reported in Andhra Pradesh Today 23 January 2022
X

Corona Cases in AP: ఏపీలో కొత్తగా 14,440 కరోనా కేసులు.. 

Corona Cases in AP: ఏపీలో కోవిడ్ మరింత విజృంభిస్తోంది. గత 24 గంటల్లో 46,650 కరోనా నిర్ధారణ పరీక్షలు జరపగా... 14,440 మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మహమ్మారితో తూర్పు గోదావరి, గుంటూరు, ప్రకాశం, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. ఒక్క రోజు వ్యవధిలో 3,969 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం 83,610 యాక్టివ్ కేసులున్నాయని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అత్యధికంగా విశాఖ జిల్లాలో 2,258 , అనంతపురంలో 1534,గుంటూరు 14,58, ప్రకాశం 1399, కర్నూలు 1238, చిత్తూరు 1198, తూర్పు గోదావరి 1012, నెల్లూరు జిల్లాలో 1103 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కోవిడ్‌ తో ఇప్పటి వరకు 14,542 మంది మృత్యువాత పడ్డారు.




Arun Chilukuri

Arun Chilukuri

Next Story