AP Corona Cases: ఏపీలో త‌గ్గుముఖం ప‌డుతున్న క‌రోనా కేసులు

AP Corona Cases: అయితే గ‌త కొన్ని రోజులుగా 20వేల పైగా ఉన్న కేసులు త‌గ్గ‌ముఖం ప‌డుతూరావ‌టం ఊర‌టనిస్తుంది

Samba Siva Rao
Published on: 28 May 2021 7:07 PM IST
14429 New Coronavirus Cases Reported in Andhra Pradesh Today 28 05 2021
X

క‌రోనా వైర‌స్ ప్రతీకాత్మ‌క చిత్రం

AP Corona Cases: ఆంధ్ర‌ప‌దేశ్ లో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి కొన‌సాగుతుంది. అయితే గ‌త కొన్ని రోజులుగా 20వేల పైగా ఉన్న కేసులు త‌గ్గ‌ముఖం ప‌డుతూరావ‌టం ఊర‌టనిస్తుంది. గడచిన 24 గంటల్లో 84,502 కరోనా పరీక్షలు నిర్వహించగా 14,429 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అదే సమయంలో 20,746 మంది కరోనా నుంచి కోcలుకోగా, 103 మంది మరణించారు. చిత్తూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 15 మంది చొప్పున మహమ్మారికి బలయ్యారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 16,57,986 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 14,66,990 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,80,362 మందికి చికిత్స జరుగుతోంది. కరోనా మృతుల సంఖ్య 10,634కి చేరింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 2,291 పాజిటివ్ కేసులు నమోదు కాగా, తూర్పు గోదావరి జిల్లాలో 2,022 కేసులు గుర్తించారు. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 535 కొత్త కేసులు వెల్లడయ్యాయి.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story