Corona Cases in AP: ఏపీలో కొత్తగా 1,413 కరోనా కేసులు, 18 మంది మృతి

Corona Cases in AP: ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా తగ్గింది.

Arun Chilukuri
Published on: 9 Aug 2021 5:49 PM IST
1,413 New Coronavirus Cases Reported in Andhra Pradesh Today 9th August 2021
X

Corona Cases in AP: ఏపీలో కొత్తగా 1,413 కరోనా కేసులు, 18 మంది మృతి

Corona Cases in AP: ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో నిన్న ఉదయం 9 గంటల నుంచి ఇవాళ ఉదయం 9 గంటల వరకు 54వేల 455 శాంపిల్స్‌ పరీక్షించగా 1,413 మందికి పాజిటివ్‌గా తేలింది. మరో 18 మంది కరోనా బాధితులు ప్రాణాలు వదిలారు. చిత్తూరులో ఐదుగురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు, తూర్పుగోదావరి, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఇద్దరు చొప్పున, శ్రీకాకుళం, విశాఖపట్నంలో ఒక్కొక్కరు మరణించారు. ఇక, ఒకేరోజు 1,795 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.

ఏపీలో నేటి వరకు 2 కోట్ల, 52లక్షల, 47వేల, 884 శాంపిల్స్‌ పరీక్షించగా ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 19 లక్షల, 83వేల, 721కు చేరింది. రికవరీ కేసుల సంఖ్య 19 లక్షల, 50వేల, 623కు పెరిగింది. ఇప్పటి వరకు మృతిచెందిన కోవిడ్‌ బాధితుల సంఖ్య 13వేల, 549కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 19వేల 549 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది ఏపీ ప్రభుత్వం.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story