Corona Cases in AP: ఏపీలో కొత్తగా 13,819 కరోనా కేసులు...

Corona Cases in AP: ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది.

Arun Chilukuri
Published on: 25 Jan 2022 6:23 PM IST
13,819 New Coronavirus Cases Reported in Andhra Pradesh Today 25 January 2022
X

Corona Cases in AP: ఏపీలో కొత్తగా 13,819 కరోనా కేసులు...

Corona Cases in AP: ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకూ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 13వేల 819 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌‌తో పోరాడుతూ మరో 12 మంది మృతిచెందారు. కరోనా బారి నుంచి మరో 5,716 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1లక్ష 13వందల 96 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది. కరోనాతో పోరాడుతూ ఇప్పటివరకూ 14,561 మంది మృతి చెందారు. అత్యధికంగా విశాఖపట్నంలో 1988 కేసులు నమోదు కాగా, ప్రకాశం 1589, గుంటూరు 1422, అనంతపురం 1345, నెల్లూరు 1305, కర్నూలు 1255, కడప 1083, తూర్పుగోదావరి 1001 కేసులు నమోదయ్యాయి.




Arun Chilukuri

Arun Chilukuri

Next Story