AP Corona Cases: క‌రోనా కేసులు త‌గ్గుముఖం..ఆందోళన క‌లిగిస్తున్న మరణాలు

AP Corona Cases: ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కరోనా వ్యాప్తి కొన‌సాగుతుంది.

Samba Siva Rao
Published on: 29 May 2021 5:42 PM IST
AP Corona Cases
X

క‌రోనా వైర‌స్ ప్ర‌తీకాత్మ‌క చిత్రం

AP Corona Cases: ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కరోనా వ్యాప్తి కొన‌సాగుతుంది. అయితే గ‌త‌వారం రోజులుగా 20వేల‌కు దిగువ‌లో క‌రోనా కేసులు న‌మోదు కావ‌డం కాస్త ఊర‌ట క‌లిగిస్తుంది. అయితే, మరణాల సంఖ్య మాత్రం ఇప్పటికీ 100కి పైనే నమోదవుతుండడం ఆందోళన కలిగించే అంశం. గడచిన 24 గంటల్లో 79,564 కరోనా పరీక్షలు నిర్వహించగా 13,756 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజాగా ఏపీలో 104 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు.

ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే 20 మంది మరణించారు. చిత్తూరు జిల్లాలో 13 మంది, విశాఖ జిల్లాలో 10 మంది బలయ్యారు. ఈ నేపథ్యంలో మొత్తం మరణాల సంఖ్య10,738కి చేరింది. ఇంకా 1,73,622 మందికి చికిత్స జరుగుతోంది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 2,301 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 2,155 కేసులు గుర్తించారు.

అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 397 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. అదే సమయంలో 20,392 మంది కొవిడ్ నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 16,71,742 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 14,87,382 మంది కోలుకున్నారు.



Samba Siva Rao

Samba Siva Rao

Next Story