Andhra Pradesh: ఏపీలో కొత్తగా 1,326 కరోనా కేసులు, 5 మంది మృతి

Andhra Pradesh: ఏపీలో కరోనా విజృంభిస్తోంది. రోజు రోజుకు భారీగా కేసులు నమోదు అవుతున్నాయి.

Arun Chilukuri
Published on: 5 April 2021 5:28 PM IST
1,326 New Coronavirus Cases Reported in Andhra Pradesh on 5th April 2021
X

Andhra Pradesh: ఏపీలో కొత్తగా 1,326 కరోనా కేసులు, 5 మంది మృతి

Andhra Pradesh: ఏపీలో కరోనా విజృంభిస్తోంది. రోజు రోజుకు భారీగా కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24గంటల్లో 30 వేల 678 శాంపిల్స్ పరీక్షించగా వారిలో 13వందల 26 మందికి కొవిడ్ సోకినట్టు ఏపీ వైద్యారోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 9లక్షల 9వేల 2కి చేరింది. కొవిడ్ సోకి మరో ఐదుగురు మృతి చెందారు. దీంతో మరణించిన వారి సంఖ్య 7 వేల 2వందల 44కి చేరింది.

ఇవాళ నమోదు అయిన కేసుల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 282 మందికి కరోనా సోకింది. గుంటూరు 271, విశాఖ 222, నెల్లూరు 171, కృష్ణా 138 చొప్పున అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కృష్ణా జిల్లాలో ఇద్దరు, అనంతపూర్, చిత్తూరు, గుంటూరు జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. మరోవైపు గడిచిన 24గంటల్లో 911 మంది కోవిడ్ నుంచి కోలుకుని ఆస్పత్రిల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 10వేల 7వందల 10 కేసులున్నట్టు ఏపీ వైద్యారోగ్యశాఖ హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story