AP Corona Cases: ఏపీలో అదుపులోకి వస్తున్న కరోనా కేసులు..కొత్తగా..

AP Corona Cases: ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో క‌రోనా సెకండ్ వేవ్ కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయి.

Samba Siva Rao
Updated on: 30 May 2021 5:37 PM IST
corona cases in Ap
X

క‌రోనా వైర‌స్ ప్ర‌తీకాత్మ‌క చిత్రం

AP Corona Cases: ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో క‌రోనా సెకండ్ వేవ్ కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయి. గ‌త కొన్ని రో్జులుగా అమ‌లు చేస్తున్న క‌ర్ఫ్యూ వ‌ల్ల క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డి అవుతున్న‌ట్లు క‌నిపిస్తుంది. ఇక రోజువారీ కేసుల సంఖ్య తగ్గడమే కాదు, మరణాలు కూడా 100కి లోపే నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 84,232 కరోనా పరీక్షలు నిర్వహించగా 13,400 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అదే సమయంలో 21,133 మంది కరోనా నుంచి కోలుకోగా, 94 మంది మరణించారు.

చిత్తూరు జిల్లాలో 14, ప్రకాశం జిల్లాలో 9, పశ్చిమ గోదావరి జిల్లాలో 9 మంది మృత్యువాతపడ్డారు. దాంతో, రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 10,832కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 16,85,142 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 15,08,515 మంది కరోనా నుంచి బయటపడ్డారు. తూర్పుగోదావరి జిల్లాలో 2,598 కేసులు నమోదు కాగా, అతి తక్కువగా విజయనగరం జిల్లాలో 362 కేసులు గుర్తించారు. ఇంకా 1,65,795 మందికి చికిత్స కొనసాగుతోంది.



Samba Siva Rao

Samba Siva Rao

Next Story