AP Corona Cases: ఏపీలో కొత్తగా 12,994 కోవిడ్ కేసులు

AP Corona Cases: ఏపీలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా రాష్ట్రంలో 12 వేల 994 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.

Venkata Chari
Published on: 24 May 2021 7:11 PM IST
12994 ‍New Coronavirus cases Reported in Andhra Pradesh Today 24 05 2021
X

కొవిడ్ టెస్ట్‌ (ఫొటో ట్విట్టర్)

AP Corona Cases: ఏపీలో కొవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా రాష్ట్రంలో 12 వేల 994 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ బారిన పడి 96 మంది మృతి చెందారు. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 15 లక్షల 930 వేల 821కు చేరగా ఇప్పటివరకు 10 వేల 222 మంది మృతి చెందినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. తాజాగా 18,373 మంది కరోనా నుంచి కోలుకున్నారని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఇక ఇప్పటివరకు రాష్ట్రంలో 13 లక్షల 76 వేల 942 మంది మహమ్మారి నుంచి కోలుకోగా ప్రస్తుతం 2 లక్షల 3 వేల 762 యాక్టివ్ కేసులున్నాయి.

గడిచిన 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 2 వేల 652 కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 16 వందల 20 కేసులు నమోదవగా పశ్చిమ గోదావరి జిల్లాలో 7 వందల 06 కేసులు .. అనంతపురంలో 10 వందల 47.. విశాఖపట్నంలో 16 వందల 90 కొత్త కేసులొచ్చాయి. ఇక తాజా మరణాల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 14 మంది మరణించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 4 గురు, విజయనగరంలో 10 మంది మృత్యువాత పడ్డారు. ఇక విశాఖపట్నంలో 8 మంది చనిపోగా అనంతపురంలో 9, తూర్పుగోదావరిలో 8, గుంటూరులో 7, కృష్ణాలో 7 చొప్పున ప్రాణాలు కోల్పోయారు.




Venkata Chari

Venkata Chari

Next Story