ఏపీలో కొత్తగా 129 కరోనా కేసులు

Arun Chilukuri
Updated on: 30 Jan 2021 8:16 PM IST
ఏపీలో కొత్తగా 129 కరోనా కేసులు
X

ఏపీలో 129 మందికి కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. ఒక కరోనా మరణం నమోదైంది. కాగా.. ఈ మేరకు శనివారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 41,003 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..129 మందికి పాజిటీవ్ తేలింది. కరోనా బారిన పడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకరు కన్నుమూశారు.

దీంతో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 7,153కి పెరిగింది. శనివారం మొత్తం 147 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జి కాగా..ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 1,287కు పడిపోయాయి. కృష్ణా జిల్లాలో అత్యధికంగా 26 కరోనా కేసులు నమోదు కాగా.. ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైంది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 8,87,720కి చేరింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story