Coronavirus: ఏపీలో కొత్తగా 1288 కరోనా కేసులు

Coronavirus: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గత కొన్నిరోజులుగా రోజుకు వెయ్యి కేసులకు పైగా నమోదవుతున్నాయి.

Arun Chilukuri
Published on: 2 April 2021 5:41 PM IST
1288 New Coronavirus Cases Reported in Andhra Pradesh 2nd April 2021
X

Coronavirus: ఏపీలో కొత్తగా 1288 కరోనా కేసులు

Coronavirus: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గత కొన్నిరోజులుగా రోజుకు వెయ్యి కేసులకు పైగా నమోదవుతున్నాయి. తాజాగా 31 వేల 116శాంపిల్స్ పరీక్షించగా 12 వందల 88 మంది కరోనా బారిన పడ్డారు. కోవిడ్ కారణంగా అనంతపురం, చిత్తూరు, గుంటూరు, ప్రకాశం, విశాఖలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. అలాగే గడిచిన 24గంటల్లో 610మంది కరోనా నుంచి కోలుకున్నారు. అటు యాక్టివ్ కేసులు కూడా రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 8వేల 815 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ ప్రకటించింది.

మరోవైపు గుంటూరు, చిత్తూరు జిల్లాలో అత్యధిక కేసులు నమోదు అయ్యాయి. గుంటూరులో 311, చిత్తూరులో 225 మందికి కొత్తగా వైరస్‌ సోకింది. అనంతపురంలో 26 తూర్పుగోదావరిలో 26 కడపలో 21 కృష్ణాలో 164 కర్నూలులో 52 నెల్లూరులో 118 ప్రకాశంలో 62 శ్రీకాకుళంలో 54 విశాఖలో 191 విజయనగరంలో 31 పశ్చిమగోదావరిలో 7 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక, కోవిడ్ బారినపడి గత 24గంటల్లో ఐదుగురు మృత్యువాత పడ్డారు. దాంతో, ఏపీలో కోవిడ్ మృతుల సం‌ఖ్య 7వేల 225కి చేరింది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story