AP Corona Cases: ఏపీలో కొత్తగా 12,768 కొవిడ్ కేసులు

AP Corona Cases: ఏపీలో కొవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 12వేల 768 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.

Venkata Chari
Published on: 2 Jun 2021 5:24 PM IST
12768 ‍New Coronavirus cases Reported in Andhra Pradesh Today 02 06 2021
X

ఏపీలో కొత్తగా 12,768 కొవిడ్ కేసులు (ఫొటో ట్విట్టర్)

AP Corona Cases: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 12 వేల లోపు కొవిడ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 98,048 శాంపిల్స్‌ పరీక్షించగా, 12 వేల 768 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ బారిన పడి 98 మంది మృతి చెందారు. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 17 లక్షల 17 వేల 156కు చేరగా ఇప్పటివరకు 11 వేల 132 మంది మృతి చెందినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. తాజాగా 15,612 మంది కరోనా నుంచి కోలుకున్నారని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం 1 లక్ష43 వేల 795 యాక్టివ్ కేసులున్నాయి.

గత 24 గంటల్లో కరోనాతో బాధపడుతూ త్యధికంగా చిత్తూరులో 15మంది చనిపోగా, నెల్లూరు, 10, పశ్చిమగోదావరి 9, అనంతపురం 8, తూర్పుగోదావరి 8, విజయనగరం 8, గుంటూరు 7, ప్రకాశం 7, శ్రీకాకుళం 7, విశాఖపట్నం 6, కృష్ణా 5, వైఎస్‌ఆర్‌ కడప 4, కర్నూలులో నలుగురు మృత్యువాతపడ్డారు. కాగా, తూర్పు గోదావరిలో అత్యధికంగా 2703 కేసులు నమోదయ్యాయి. చిత్తూరులో 1551, గుంటూరులో 765 కేసులు నమోదయ్యాయి.


Venkata Chari

Venkata Chari

Next Story