AP Corona Cases: రికార్డు స్థాయిలో కోవిడ్‌ కేసులు..24 గంటల్లో 69 మరణాలు

AP Corona Cases: గుంటూరులో 15 వందల 76 కేసులు వచ్చాయి.

Samba Siva Rao
Updated on: 25 April 2021 7:00 PM IST
Corona Cases Recorded AP
X

కరోనా వైరస్ ప్రతీకాత్మక చిత్రం 

AP Corona Cases: ఏపీలో రికార్డు స్థాయిలో కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి. కొత్తగా రాష్ట్రంలో 12 వేల 634 మందికి పాజిటివ్‌గా నిర్ధారణైంది. గడిచిన 24 గంటల్లో కోవిడ్‌ కారణంగా 69 మంది మృతి చెందారు. కొత్తగా నమోదైన కేసులతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య పది లక్షల 33 వేల 560కి చేరింది. మరణాలు 7 వేల 6 వందల 85కి చేరాయి.

ఇక ‌శ్రీకాకుళం, చిత్తూరు జిల్లాల్లో కోవిడ్ కల్లోలం కొనసాగుతోంది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా 16 వందల 80 కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 16 వందల 28, గుంటూరులో 15 వందల 76 కేసులు వచ్చాయి. ఇక కోవిడ్‌తో కృష్ణా జిల్లాలో అత్యధికంగా 12 మంది మృతి చెందారు. నెల్లూరు జిల్లాలో ఏడుగురు, తూర్పు గోదావరి జిల్లా, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఆరుగురు చొప్పున మృతి చెందారు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story