Coronavirus Updates in AP: ఏపీలో మరో 1263 కరోనా పాజిటివ్‌ కేసులు

Arun Chilukuri
Updated on: 6 July 2020 4:54 PM IST
Coronavirus Updates in AP: ఏపీలో మరో 1263 కరోనా పాజిటివ్‌ కేసులు
X

Coronavirus Updates in AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 1263 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 16,712 శాంపిల్స్‌ని పరీక్షించగా 1263 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. 424 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్‌ కారణంగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కరోనాతో 7 మంది ప్రాణాలు కోల్పోయారు. కోవిడ్‌ వల్ల శ్రీకాకుళం లో ఇద్దరు, అనంతపూర్‌ లో ఒక్కరు, చిత్తూర్‌ లో ఒక్కరు, గుంటూరు లో ఒక్కరు, కృష్ణ లో ఒక్కరు మరియు వీశాఖపట్నం లో ఒక్కరు మరణించారు.

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు 17,365. ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 239. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 7252కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 9874 మంది చికిత్స పొందుతున్నారు.





Arun Chilukuri

Arun Chilukuri

Next Story