Coronavirus: ఏపీలో కొత్తగా 1184 కరోనా కేసులు

1184 New Coronavirus Cases Reported in Andhra Pradesh 31st March 2021
x

Coronavirus: ఏపీలో కొత్తగా 1184 కరోనా కేసులు

Highlights

Coronavirus: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. రోజురోజుకీ బాధితుల సంఖ్య పెరిగిపోతోంది.

Coronavirus: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. రోజురోజుకీ బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. ప్రతిరోజూ సుమారు వెయ్యి కేసులు నమోదవుతున్నాయి. ఇక, ఇవాళైతే కరోనా పాజిటివ్ కేసులు ఏకంగా వెయ్యి దాటేశాయి. గత 24గంటల్లో 30వేల 964శాంపిల్స్‌ను పరీక్షించగా 11వందల 84మందికి వైరస్‌ సోకినట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ తేలిపింది. మరోవైపు యాక్టివ్ కేసులు కూడా రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కొద్దిరోజుల క్రితం వరకు వెయ్యి రెండు వేలు మాత్రమే ఉన్న యాక్టివ్ కేసులు ఇప్పుడు ఏకంగా 7వేలు దాటేశాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 7వేల 338 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ ప్రకటించింది.

గుంటూరు జిల్లాలో అత్యధికంగా 352 కేసులు నమోదు కాగా అనంతపురంలో 66 తూర్పుగోదావరిలో 26 చిత్తూరులో 115 కడపలో 62 కృష్ణాలో 113 కర్నూలులో 64 నెల్లూరులో 78 ప్రకాశంలో 45 శ్రీకాకుళంలో 47 విశాఖలో 186 విజయనగరంలో 19 పశ్చిమగోదావరిలో 11 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక, కోవిడ్ బారినపడి గత 24గంటల్లో నలుగురు మృత్యువాత పడ్డారు. చిత్తూరు జిల్లాలో ముగ్గురు, నెల్లూరు జిల్లాలో ఒకరు మరణించారు. దాంతో, ఏపీలో కోవిడ్ మృతుల సం‌ఖ్య 7వేల 217కి చేరింది.


Show Full Article
Print Article
Next Story
More Stories