AP Corona Cases: ఏపీలో కొత్తగా 11,766 కరోనా కేసులు, 38 మంది మృతి

AP Corona Cases: ఏపీలో కరోనా వైరస్ ప్రతాపం చూపిస్తోంది. సెకండ్‌ వేవ్‌లో తొలిసారి గురువారం 10 వేలు దాటిన కొవిడ్ కేసులు నేడు11వేల మార్క్‌ దాటింది.

Samba Siva Rao
Published on: 23 April 2021 7:00 PM IST
Corona Cases Filed In Ap
X

కరోనా వైరస్  ప్రతీకాత్మక చిత్రం

AP Corona Cases: ఏపీలో కరోనా వైరస్ ప్రతాపం చూపిస్తోంది. సెకండ్‌ వేవ్‌లో తొలిసారి గురువారం 10 వేలు దాటిన కొవిడ్ కేసులు నేడు11వేల మార్క్‌ దాటింది. తాజాగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసులు 10 లక్షలు దాటాయి. కేసులతో పాటు క్రమంగా వైరస్‌ బారిన మరణించిన వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 45,581 పరీక్షలు నిర్వహించగా.. 11,766 కేసులు నిర్ధారణ కాగా.. 38 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 7,579కి చేరింది.

కొవిడ్‌తో నెల్లూరులో ఆరుగురు, చిత్తూరులో ఐదుగురు, తూర్పు గోదావరి 4, కృష్ణా 4, కర్నూలు 4, ప్రకాశం 4, శ్రీకాకుళంలో నలుగురు చొప్పున మృతి చెందారు. విశాఖలో ముగ్గురు, గుంటూరు, విజయనగరంలో ఇద్దరేసి ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల వ్యవధిలో 4,441 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 9,27,418కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 74,231 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,58,80,750 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. అత్యధికంగా చిత్తూరులో 1,885, అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 190 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 10,09,228 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story