AP Corona Cases: ఏపీలో కొత్తగా 11,698 కరోనా కేసులు, 37 మంది మృతి

AP Corona Cases: ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది.

Arun Chilukuri
Published on: 24 April 2021 6:31 PM IST
11,698 New Coronavirus Cases Reported in Andhra Pradesh on 24 April 2021
X

AP Corona Cases: ఏపీలో కొత్తగా 11,698 కరోనా కేసులు, 37 మంది మృతి

AP Corona Cases: ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా 11 వేల 698 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 37 మంది కరోనాకు బలయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 10 లక్షల, 18 వేల 031 మంది కరోనా బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

కొవిడ్‌తో తూర్పు గోదావరి, నెల్లూరు జిల్లాల్లో ఆరుగురు చొప్పున అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో నలుగురు చొప్పున, పశ్చిమగోదారి జిల్లాలో ముగ్గురు మృతి చెందారు. ఇక గుంటూరు, కృష్ణా, కర్నూలు, విశాఖ పట్నం, విజయనగరం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, ప్రకాశం జిల్లాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story