AP Corona Cases: ఏపీలో కొత్తగా 11,421 కొవిడ్ కేసులు

AP Corona Cases: ఏపీలో కొవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 11వేల 421 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.

Venkata Chari
Updated on: 3 Jun 2021 7:26 PM IST
11421 ‍New Coronavirus cases Reported in Andhra Pradesh Today 03 06 2021
X
కొవిడ్ పరీక్ష (ఫొటో ట్విట్టర్)

AP Corona Cases: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 12 వేల లోపు కొవిడ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 86,223 శాంపిల్స్‌ పరీక్షించగా, 11 వేల 421 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ బారిన పడి 81 మంది మృతి చెందారు.

ఇప్పటివరకు 11 వేల 213 మంది మృతి చెందినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. తాజాగా 16,223 మంది కరోనా నుంచి కోలుకున్నారని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం 1 లక్ష38 వేల 912 యాక్టివ్ కేసులున్నాయి.


Venkata Chari

Venkata Chari

Next Story