AP Corona Cases: ఏపీలో కొత్తగా 11,303 కొవిడ్ కేసులు

AP Corona Cases: రోజువారీ కేసులు తగ్గుతున్నా ఆగని మరణాలు * గత 24గంటల్లో 104మంది మృత్యువాత... 11,303 కేసులు

Sandeep Eggoju
Published on: 1 Jun 2021 6:01 PM IST
Today Corona Cases in Andhra Pradesh
X

Representational Image

AP Corona Cases: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. రోజువారీ పాజిటివ్ కేసులు తగ్గుతున్నా మరణాలు మాత్రం ఆగడం లేదు. దాంతో, ఏపీలో ప్రతిరోజూ కరోనా మృత్యుఘోష వినిపిస్తోంది. ఇక, గత 24గంటల్లో కొత్తగా 11వేల 303 కేసులు నమోదు కాగా, 104మంది కరోనాకు బలైపోయారు. పశ్చిమగోదావరిలో 20మంది, చిత్తూరులో 14మంది మరణించగా అనంతపురం, గుంటూరులో 9మంది చొప్పున మృత్యువాత పడ్డారు. అలాగే, తూర్పుగోదావరిలో 8మంది, విశాఖలో ఏడుగురు బలైపోగా కర్నూలు, శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణాజిల్లాల్లో ఆరుగురు చొప్పున మరణించారు. ఇక, కడపలో ఐదుగురు, నెల్లూరులో నలుగురు, ప్రకాశంలో నలుగురు కరోనాతో మరణించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story