ఏపీలో కొత్తగా 1,121 కరోనా కేసులు!

ఏపీలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా గడిచిన 24 గంటల్లో 71,913 కరోనా టెస్టులు చేయగా 1,121 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.

Krishna
Published on: 22 Nov 2020 5:38 PM IST
ఏపీలో కొత్తగా 1,121 కరోనా కేసులు!
X

ఏపీలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా గడిచిన 24 గంటల్లో 71,913 కరోనా టెస్టులు చేయగా 1,121 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,62,213 కి చేరుకుంది. అయితే ఇందులో 14,249 యాక్టివ్ కేసులుండగా 8,41,026 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 1,631 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అటు గడిచిన 24 గంటల్లో కరోనాతో కొత్తగా 11 మంది చనిపోయారు. దీనితో మృతుల సంఖ్య 6,938 కి చేరుకుంది.

కరోనా వలన చిత్తూరులో ఇద్దరు, కృష్ణలో ఇద్దరు, అనంతపూర్, తూర్పు గోదావరి, గుంటూరు, కడప, విశాఖపట్నం, విజయనగరం, పశ్చిమ గోదావరి ఒక్కరు చొప్పున మరణించారు. అటు జిల్లాల పరంగా కేసులు చూసుకుంటే.. అనంతపుర్ లో 46, చిత్తూరులో 130, ఈస్ట్ గోదావరిలో 134, గుంటూరులో 164, కడపలో 60, కృష్ణాలో 167, కర్నూల్ లో 21, నెల్లూరులో 26, ప్రకాశంలో 64, శ్రీకాకుళం 67, విశాఖపట్నం 77, విజయనగరం 23, వెస్ట్ గోదావరి 142 కేసులు నమోదు అయ్యాయి.. ఇక ఇప్పటివరకు ఏపీలో 96,15,090 కరోనా టెస్టులు నిర్వహించారు.


Krishna

Krishna

Next Story