Corona Cases in AP: ఏపీలో కొత్తగా 1,085 కరోనా కేసులు

* ఏపీలో అదుపులోకి వస్తున్న కరోనా * గడిచిన 24 గంటల్లో 8 మంది మృతి

Sandeep Reddy
Updated on: 22 Aug 2021 9:01 PM IST
1,085 New Coronavirus Reported in Andhra Pradesh Today 22 08 2021
X

Representation Photo

Corona Cases in AP: ఏపీలో కరోనా ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా ఒక వెయ్యి 85 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 8 మంది మృతి చెందారు. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20 లక్షల 2 వేల 340కి చేరుకుంది. ఇప్పటి వరకు 19 లక్షల 73 వేల 940 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం 13 వేల723 మంది కరోనాతో మృతి చెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ప్రస్తుతం ఏపీలో 14,677 యాక్టివ్‌ కేసులున్నాయి. కరోనాతో కృష్ణా జిల్లాలో ముగ్గురు మృతి చెందారు. కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, విశాఖ, పశ్చిమగోదావరి జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story