Nellore: అల్లుడా మజాకా... కొత్త అల్లుడికి 108 రకాలతో విందు..!

Nellore: అల్లుడా మజాకా... అన్నట్లు కొత్త దంపతులకు కలకాలం గుర్తుండేలా పసందైన విందు ఇచ్చారు ఓ మామ.

Arun Chilukuri
Published on: 2 Feb 2023 10:54 AM IST
108 Variety Of Dishes Served To son-in-law In Podalakur
X

Nellore: అల్లుడా మజాకా... కొత్త అల్లుడికి 108 రకాలతో విందు..

Nellore: అల్లుడా మజాకా... అన్నట్లు కొత్త దంపతులకు కలకాలం గుర్తుండేలా పసందైన విందు ఇచ్చారు ఓ మామ. తొలిసారిగా ఇంటికొచ్చిన అల్లుడికి 108 రకాల వంటకాలు చేసి వడ్డించి... ఔరా... అనిపించుకున్నారు. పొదలకూరు మండలం ఊసపల్లి గ్రామానికి చెందిన ఊసా శివకుమార్, శ్రీదేవమ్మ దంపతుల కుమార్తె శివానికి నెల్లూరు బీవీ నగర్‌కు చెందిన ఉమ్మడిశెట్టి శివకుమార్‌తో ఇటీవల వివాహమైంది. మొదటిసారి కొత్త అల్లుడు ఇంటికి వస్తున్న నేపథ్యంలో ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేయాలని భావించాడు ఊసా శివకుమార్.

పొదలకూరులోని తాజ్ బిర్యాని హౌస్‌ యజమాని శివాజీకి విషయం చెప్పారు. చికెన్, మటన్, రొయ్యలు, చేపలతో కలిపి 108 రకాల వంటకాలు తయారు చేయించారు. ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేసి అన్ని రకాల వంటకాలను అల్లుడికి వడ్డించారు. ఒక్కసారిగా అన్ని రకాల వంటకాలు చూసిన అల్లుడు, మామ ప్రేమకు పులకరించిపోయాడు. ప్రేమతో చేయించిన వంటకాలన్ని రుచి చూశాడు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story