ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

ఏపీలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా గడిచిన 24 గంటల్లో 53,215 కరోనా టెస్టులు చేయగా 1,056 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.
ఏపీలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా గడిచిన 24 గంటల్లో 53,215 కరోనా టెస్టులు చేయగా 1,056 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,54,011 కి చేరుకుంది. అయితే ఇందులో 18,659 యాక్టివ్ కేసులుండగా 8,28,484 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 2,140 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అటు గడిచిన 24 గంటల్లో కరోనాతో కొత్తగా 14 మంది చనిపోయారు. దీనితో మృతుల సంఖ్య 6868 కి చేరుకుంది.
ఇక, ఇవాళ అనంతపురం, చిత్తూరు, కృష్ణా, విశాఖలో ఇద్దరు చొప్పున మరణించగా.. గుంటూరు, కడప, ప్రకాశం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరిలో ఒక్కొక్కరు మృత్యువాత పడ్డారు. అటు జిల్లాల పరంగా కేసులు చూసుకుంటే.. అనంతపుర్ లో 70, చిత్తూరులో 87, ఈస్ట్ గోదావరిలో 139, గుంటూరులో 206, కడపలో 47, కృష్ణాలో 153, కర్నూల్ లో 27, నెల్లూరులో 30, ప్రకాశంలో 37, శ్రీకాకుళం 24, విశాఖపట్నం 57, విజయనగరం 25, వెస్ట్ గోదావరి 154 కేసులు నమోదు అయ్యాయి.. ఇక ఇప్పటివరకు ఏపీలో 91,54,263 కరోనా టెస్టులు నిర్వహించారు.
#COVIDUpdates: 15/11/2020, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) November 15, 2020
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8,51,116 పాజిటివ్ కేసు లకు గాను
*8,25,589 మంది డిశ్చార్జ్ కాగా
*6,868 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 18,659#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/0f78YJ1s4F