AP Corona Cases: ఏపీలో కొత్తగా 10,373 కొవిడ్ కేసులు

AP Corona Cases: ఏపీలో కొవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 10వేల 373 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.

Venkata Chari
Published on: 5 Jun 2021 5:46 PM IST
10373 ‍New Coronavirus cases Reported in Andhra Pradesh Today 05 06 2021
X

కరోనా టెస్ట్‌ (ఫొటో ట్విట్టర్)

AP Corona Cases: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 11 వేల లోపు కొవిడ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 88,441 శాంపిల్స్‌ పరీక్షించగా, 10 వేల 373 కరోనా కేసులు నమోదయ్యాయి.

గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ బారిన పడి 80 మంది మృతి చెందారు. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 17 లక్షల 49 వేల 363కు చేరగా ఇప్పటివరకు 11 వేల 376 మంది మృతి చెందినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. తాజాగా 15,958 మంది కరోనా నుంచి కోలుకున్నారని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం 1 లక్ష28 వేల 108 యాక్టివ్ కేసులున్నాయి.



Venkata Chari

Venkata Chari

Next Story