Andhra Pradesh: ఏపీలో విజృంభిస్తోన్న కరోనా వైరస్‌

Andhra Pradesh: ఏపీలో కరోనా విజృంభిస్తోంది. గత వారం రోజులుగా క్రమంగా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. ఇవాళ ఏకంగా వెయ్యి కేసులు నమోదు అయ్యాయి.

Arun Chilukuri
Published on: 28 March 2021 6:20 PM IST
1005 New Coronavirus Cases in Andhra Pradesh
X

Andhra Pradesh: ఏపీలో విజృంభిస్తోన్న కరోనా వైరస్‌

Andhra Pradesh: ఏపీలో కరోనా విజృంభిస్తోంది. గత వారం రోజులుగా క్రమంగా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. ఇవాళ ఏకంగా వెయ్యి కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24గంటల్లో 31 వేల 142 శాంపిల్స్ పరీక్షించగా అందులో ఒక వెయ్యి ఐదు మందికి పాజిటివ్ సోకింది. కొవిడ్ సోకి ఇవాళ మరో ఇద్దరు మృతి చెందారు.

ఇవాళ నమోదు అయిన కేసుల్లో అత్యధికంగా గుంటూరు జిల్లాలో ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 225 మందికి కరోనా సోకింది. ఆ తర్వాత చిత్తూరులో 184, కృష్ణా 135, విశాఖ 167, నెల్లూరు 84 కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24గంటల్లో కొవిడ్ వల్ల చిత్తూరు, కృష్ణా జిల్లాలో ఒక్కొక్కరు మృతి చెందారు. దీంతో మరణాలు సంఖ్య 7వేల 2వందల 5కి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ నుంచి 324 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5వేలకు పైగా యాక్టివ్ కేసులున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story