ఏపీలో కోటి దాటిన కరోనా టెస్టుల సంఖ్య

ఏపీలో కోటి దాటిన కరోనా టెస్టుల సంఖ్య
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పరీక్షల సంఖ్య కోటి దాటింది. ఒక్కరోజు వ్యవధిలో 54,710 కొవిడ్‌ సాంపుల్స్‌ని పరీక్షించడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు జరిపిన...

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పరీక్షల సంఖ్య కోటి దాటింది. ఒక్కరోజు వ్యవధిలో 54,710 కొవిడ్‌ సాంపుల్స్‌ని పరీక్షించడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు జరిపిన పరీక్షల సంఖ్య 1,00,17,126కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది.

గడిచిన 24 గంటల్లో 620 మందికి కరోనా నిర్ధారణ అయింది. తాజాగా ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 6,988కి చేరింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,67,683కి చేరింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 3,787 మంది కొవిడ్‌ నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో 8,52,298 మంది బాధితులు కోలుకొని ఇళ్లకు వెళ్లిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 8,397 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories