మాంసం తిని ఆలయాలకు వెళ్లకూడదని ఎందుకంటారు?

Update: 2017-09-13 11:03 GMT

పెద్దలు ఏది చెప్పినా దానికో అర్థంపరమార్థం ఉంటుంది. అందుకే పెద్దల మాట.. చద్దనం మూట అని అంటుంటారు. అయితే అవన్నీ అప్పటి కాలానికి నీతులని, ఇప్పటి కాలంలో కూడా వాటినే పట్టుకుని ఎందుకు వేలాడతారని ప్రశ్నించే వారు కూడా ఉన్నారు. కానీ ఎక్కువ మంది కొన్ని విషయాలలో పెద్దల చెప్పిన మాటలను ఇప్పటికీ పాటిస్తున్నారు. మాంసాహారం తిన్న రోజు ఆలయాలకు వెళ్లకపోవడం కూడా అలాంటి వాటిలో ఒకటి. ఇప్పటికీ చాలామంది ఆలయాలకు వెళ్లాలనుకున్న రోజు మాంసాహారానికి దూరంగా ఉంటారు. అయితే దీని వెనుక బలమైన కారణం ఉందని కొందరు చెబుతున్నారు.

మాంసాహారాన్ని భుజించడం వల్ల బుద్ధి మందగిస్తుందని.. కామక్రోధాలపై వ్యామోహం పెరిగి.. ఆధ్యాత్మికపై మనసు లగ్నం చేయలేరని.. అందుకే మాంసాన్ని ఆలయానికి వెళ్లే ముందు తినవద్దని చెబుతారని వివరిస్తున్నారు. అయితే కొన్ని ఆలయాల్లో మాత్రం ఈ పట్టింపు లేదు. కొన్ని అమ్మవారి ఆలయాలకు మాంసాహారం తిన్నా కూడా వెళ్లొచ్చు. పూరీ జగన్నాథ ఆలయంలో స్వామివారి భార్య విమలా దేవికి ప్రతిరోజూ పూజలు చేసి మేకను బలిస్తారు. ఆ మాంసాన్నే భక్తులకు ప్రసాదంగా పెడతారు. కానీ శైవవైష్ణవ ఆలయాలకు, హనుమాన్ ఆలయాలకు మాంసం తిని పొరపాటున కూడా వెళ్లకూడదనే నియమం ప్రచారంలో ఉంది. 

Similar News