hmtv Mathru Shakthi Awards - 2026: ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కొండూరి పద్మావతికి లైఫ్ టైమ్ ఎచీవ్మెంట్ అవార్డు
hmtv Mathru Shakthi Awards - 2026: ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కొండూరి పద్మావతికి లైఫ్ టైమ్ ఎచీవ్మెంట్ అవార్డు
hmtv Mathru Shakthi Awards - 2026
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి కొండూరి పద్మావతి గారికి హెచ్.ఎమ్.టి.వి మాతృ శక్తి - 2026 అవార్డుల ప్రదానోత్సవంలో 'లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్' ప్రధానం చేశారు.
కొండూరి పద్మావతి:
ఆధ్యాత్మిక సేవ: శ్రీమతి కొండూరి పద్మావతి గారు ప్రముఖ ప్రవచనకర్త మరియు శ్లోక పారాయణకారిణి. ఆమె శ్రీమన్నారాయణీయం, సౌందర్య లహరి, శివానంద లహరి వంటి పవిత్ర గ్రంథాలను అర్థ వివరణతో పారాయణం చేస్తూ ఆధ్యాత్మిక ప్రచారం చేస్తున్నారు
ప్రసార మాధ్యమాలు: వివిధ టీవీ ఛానెళ్లు, ప్రసార మాధ్యమాల ద్వారా ఆమె చేస్తున్న ప్రవచనాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి.
ఆధ్యాత్మిక బృందాలు: నవరాత్రులు, కార్తీక మాసాల వంటి పవిత్ర సమయాల్లో పారాయణ బృందాలతో కలిసి ఆమె ఆధ్యాత్మిక సేవలు అందిస్తున్నారు. శారదా పీఠం శ్రీ విధుశేఖర భారతీ స్వామి వారి ఆశీస్సులు కూడా ఆమెకు లభించాయి
పురస్కారం: ఆధ్యాత్మిక రంగంలో ఆమె చేస్తున్న కృషికి గుర్తింపుగా హెచ్.ఎమ్.టి.వి 'మాతృశక్తి-2026' కార్యక్రమంలో భాగంగా ఈ ప్రత్యేక పురస్కారాన్ని అందజేసింది