సినిమా గ్రామర్ లోకి, గ్లామర్ తెచ్చిన వ్యక్తి!

Update: 2019-05-23 14:52 GMT

సినిమా గ్రామర్ లోకి, గ్లామర్ తీసుకువచ్చిన మన దర్శకేంద్రుడు పుట్టిన రోజు ఈ రోజు. పండ్లకు, పూలకు వున్న అందాన్ని, వెండి తేరపై రసవత్తరంగా చూపిన వెండితెర శ్రీనాధుడి పుట్టిన రోజు ఈ రోజు. సామాన్యునికి కళా పోషణ వుంటుంది అని, ఆకు చాటు పిందె చూపి..టాకీసుల్లో హౌస్ ఫుల్ బోర్డు పెట్టేలా చేసిన దర్శకుడి పుట్టిన రోజు ఈ రోజు.

మన దర్శకేంద్రుడి పూర్తి పేరు....కోవెలమూడి రాఘవేంద్రరావు. మన అందరికి పరిచయమున్న పేరు కె. రాఘవేంద్ర రావు. బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టడం అంటే ఏంటో... చూపిన వ్యక్తి... తెలుగు చిత్ర సీమలో "సిరులు" పండిచడం ఎలాగో నేర్పిన వ్యక్తి, చిత్ర సీమలోనే మహా శక్తి పుట్టిన రోజు ఈ రోజు. తెలుగు సినీ రంగములో దర్శకేంద్రుడు అని పిలువబడే శతాధిక చిత్రాల దర్శకుడు, నిర్మాత. చిత్ర సీమలో సిత్రాలు చేయడం కోసం ఆయన మే 23, 1942 తేదీన కృష్ణా జిల్లా, కంకిపాడు మండలానికి చెందిన కోలవెన్ను గ్రామంలో జన్మించాడు. ఆ తర్వాత ఎంతో మంది కథానాయకులతో ఎన్నో బాక్స్ ఆఫీస్ బద్దలు చేసే చిత్రాలు తీశాడు.

టాకీసులో టిక్కెట్లు అన్ని తెగేలా చేసి.. ప్రేక్షకుల విజిల్స్ తోనే విజయోత్సవాలు చూపాడు. అలాగే స్త్రీ పాత్రలే ప్రధానంగా జ్యోతి, ఆమె కథ, కల్పన లాంటి గొప్ప చిత్రాలు తీశాడు. అతిలోక సుందరి అయిన ... అన్నమయ్య అయిన అలా తెలుగు ప్రేక్షకుడిని ఒప్పిస్తాడు, మెప్పిస్తాడు, టాకీసుకి రప్పిస్తాడు. సినిమా టికెట్ కోసం సగటు మనిషి పెట్టిన డబ్బులకి ఎన్నో రెట్లు ఎక్కువ ఆనందాన్ని పంచె, మన దర్శకేంద్రుడు ఇంకా ఎన్నో సినిమాలు తీయాలి ఆశిస్తూ. పుట్టిన రోజు శుభాకాంక్షలు. 

Similar News