పద్మ విభూషణ్ శ్రీ ఎన్.ఆర్.నారాయణ మూర్తి గారి పుట్టినరోజు ఈ రోజు

Update: 2019-08-20 07:32 GMT

ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి గా ప్రసిద్ధులైన నాగవర రామారావు నారాయణ మూర్తి మన దేశానికి చెందిన గొప్ప పారిశ్రామిక వేత్త మరియు సాఫ్టువేరు ఇంజనీరు మరియు ఇన్ఫోసిస్ వ్యస్థాపకుడు అని మన అందరికి తెలిసిందే. ఈ రోజు నారాయణ మూర్తి గారి పుట్టినరోజు. ప్రస్తుతము ఆయన ఇన్ఫోసిస్ కు ముఖ్య గురువు. ఆయన 1981 నుండి 2002 వరకు,21 సంవత్సరాలు ఆ సంస్థకు ముఖ్య కార్యనిర్వాహక అధికారిగా ఉన్నారు. 2002 లో CEO గా పదవీవిరమణ చేసిన తర్వాత,సంఘ సేవలకు మరియు భారతదేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధం చేయటానికి తన కార్యకలాపాలను విస్తృతం చేసాడు. నారాయణ మూర్తి గారు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు. 2000 సంవత్సరంలో పద్మ శ్రీ పురస్కారాన్ని ఇచ్చి మన ప్రభుత్వం గౌరవించింది, ఆ తర్వాత 2008 లో మన దేశము యొక్క రెండవ అతిపెద్ద పౌర పురస్కారమైన పద్మ విభూషణ్తో కలిపి అనేక పురస్కారాలను అందుకున్నారు. 2009 లో ఆయన ప్రపంచవ్య్యప్తంగా చేసిన ప్రసంగాలన్నీఎ బెటర్ ఇండియా: ఎ బెటర్ వరల్డ్ పుస్తకంగా ప్రచురితమయ్యాయి. నారాయణ మూర్తి గారు మన దేశంలోని వేలాది యువతకు రోల్ మోడల్ గా నిలిచారు.

Tags:    

Similar News