పాటల కుమార్... కిషోర్ కుమార్ పుట్టిన రోజు ఈ రోజు.

Update: 2019-08-04 06:34 GMT

చల్‌తే చల్‌తే మేరే యే గీత్ యాద్ రఖనా... తన అభిమానుల కోసం అద్భుతంగా పాడిన కిషోర్ కుమార్ పుట్టినరోజు ఈ రోజు. కిషోర్ కుమార్ అసలు పేరు....అభాస్ కుమార్ గంగూలీ హింది సినిమా నటుడు మాత్రమే కాదు , అద్భుతమైన నేపథ్యగాయకుడు మరియు నిర్మాత, సంగీత దర్శకుడు, పాటల రచయిత, సినిమా రచయిత, హాస్యరస చక్రవర్తి. అనేక కళలు ఒక్క మనిషి లోనే నిక్షిప్తమై ఉండడం నిజంగా ఆశ్చర్యకరమే. కిశోర్ అన్నయ్య...ఆశోక్ కుమార్ హిందీ చిత్రసీమలో నటునిగా చేరిన తరువాత గంగూలీ కుటుంబం తరచుగా ముంబై సందర్శించేవారు. అభాస్ కుమార్ తన పేరును "కిషోర్ కుమార్" గా మార్చుకున్నాడు. అతను పాడిన వందలాది పాటలు కిషోర్ ను మన హృదయాల్లో శాశ్వతంగా నిచిలిపోయేట్టు చేస్తాయి.

హిందీ సినిమా పరిశ్రమలో ప్రసిద్ధి చెందిన గాయకులలో ఒకనిగా గుర్తింపు పొందాడు. అతను 'ట్రాజెడీ కింగ్' గా ప్రసిధ్ధి. హిందీ చిత్రాలతో పాటు అతను బెంగాలీ, మరాఠీ, అస్సామీ, గుజరాతీ, కన్నడ, బోజ్‌పురి, మలయాళం, ఉర్దూ భాషా చిత్రాలలో పాటలను పాడాడు. అతను అనేక భాషలలో ప్రవేట్ ఆల్బంలలో పాడాడు. ముఖ్యంగా బెంగాలీ భాషా ఆల్బంలు చేసాడు. అతను ఉత్తమ పురుష నేపధ్య గాయకునిగా ఎనిమిది ఫిలిం ఫేర్ పురస్కారాలను పొందాడు. ఈ విభాగంలో అత్యధిక ఫిలిం ఫేర్ పురస్కారాలు పొందిన రికార్డును స్వంతం చేసుకున్నాడు. ఈ రోజుకి అయన పాటలు అందరు వింటూనే వుంటారు.

Tags:    

Similar News