ఎంపీటీసీకి వైట్ క‌ల‌ర్, జ‌డ్పీటీసీకి పింక్ క‌ల‌ర్..

Update: 2019-05-05 14:59 GMT

తెలంగాణలో ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ తొలివిడత ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. సోమవారం తొలి విడత పరిషత్ ఎన్నికలు జరగనున్నాయి. స్థానికసంస్థల్లో పట్టు సాధించేందుకు కాంగ్రెస్ అభ్యర్ధులు, పట్టు నిలుపుకునేందుకు టీఆర్ఎస్ పావులు కదుపుతున్నాయి. సోమవారం ఉదయం 7 గంట‌ల నుండి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు పోలింగ్ జరగనుంది. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో 4 గంటల వరకే పోలింగ్ జరగనుంది. ఎంపీటీసీకి వైట్ క‌ల‌ర్, జ‌డ్పీటీసీకి పింక్ క‌ల‌ర్ బ్యాలెట్ ద్వారా ఎన్నిక‌లు నిర్వహించనున్నారు.

3 దశల్లో పరిషత్ ఎన్నికల జరుగనుండగా.. మొద‌టి విడ‌త‌లో 197 జ‌డ్పీటీసీ, 2 వేల166 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ వెలువడింది. తొలి విడ‌త‌లో నిజామాబాద్‌లో మాక్లూరు, జ‌గిత్యాల‌లో జిల్లాలోని కోరుట్ల జ‌డ్పీటీసీ స్థానాలు ఏక‌గ్రీవం అయినట్టు ఎన్నిక‌ల క‌మిష‌న్ ప్రకటించింది. అలాగే తొలి విడతలో 2166 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. 69 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 2097 స్థానాల్లో పోలింగ్‌ నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది.

Similar News