మా గ్రామాల్లోకి ఎవరూ రావొద్దు.. మేము ఎక్కడికీ పోము..

రోనా వైరస్ కట్టడి చేయడానికి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నడుం బిగించాయి. ఈ నెల 31వ తేదీ వరకు ఎవరూ బయటికి వెల్లొద్దంటూ ఆదేశాలు జారీచేసింది.

Update: 2020-03-24 10:22 GMT
Youth Sets own Check Points

కరోనా వైరస్ కట్టడి చేయడానికి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నడుం బిగించాయి. ఈ నెల 31వ తేదీ వరకు ఎవరూ బయటికి వెల్లొద్దంటూ ఆదేశాలు జారీచేసింది. నిత్యావసర వస్తువుల కొనుగోలు కోసం మాత్రమే బయటికి రావాలని, అది కూడా కుటుంబంలోని ఒక్క వ్యక్తి మాత్రమే తగిన జాగ్రత్తలు తీసుకుని యబటికి రావాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రభుత్వం జనాలు వీధుల్లో తిరగకుండా చర్యలు చేపట్టింది. ఒక వేల అత్యవసర వస్తువుల కోసం బయటికి వెల్లిన ప్రజలు కూడా దూరాన్ని పాటించాలని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు రాష్ట్రాల సరిహద్దులవద్ద కాపలా కాస్తున్నారు. వేరే రాష్ట్రాల నుంచి వస్తున్న వాహనాలను సరిహద్దుల్లోనే నిలిపివేస్తున్నారు. కేవలం పాలు, కూరగాయల వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. ఎవరైనా ఈ నిబంధనలను మీరితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందులో భాగంగానే కొన్ని గ్రామాల యువత అప్రమత్తమయ్యారు.

కరోనాని కట్టడి చేసేందుకు తమ వంతు కృషి చేస్తున్నారు. తమ గ్రామాలకు బయటి గ్రామాల నుంచి ఎవరూ రాకుండా గ్రామ పొలిమేరల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసారు. బయటి వారిని గ్రామాల్లో రానివ్వకుండా చూస్తున్నారు. రాష్ట్రంలోని చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ కోణంలోనే ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం నారాయణపురం గ్రామం స్వీయ నిర్బంధంలో ఉంది. ఈ గ్రామ ప్రజలు బయటి గ్రామాల నుంచి వచ్చే వారిని వారి గ్రమాలకు రానివ్వకుండా చూస్తున్నారు.

వారు కూడా ఇతర గ్రామాలకు వెల్లడంలేదు. తమ గ్రామాన్ని స్వీయ నిర్భంధం చేసుకున్న గ్రామస్తులు, కూరగాయలు, నిత్యావసర వస్తువులు, పాలు అన్ని తమ గ్రామంలో లభించేవి అందరం వాడుకుంటాం అని తెలియచేస్తున్నారు. ఏమైనా అత్యవసరం ఉంటే పోలీస్ రెవిన్యూ అధికారులద్వారా తెప్పించుకుంటాం తప్ప బయటకు రాము అని స్వీయ నిర్బంధంలో ఉన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం మార్లబీడు, శంషాబాద్ మండలంలోని జూకల్ గ్రామాలలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. చుట్టుపక్కల గ్రామాల్లో వాహనాలు వెళ్లకుండా కట్టలు, ముళ్ల కంపలు అడ్డంపెట్టి పలు రహదారులను మూసివేశారు.


Tags:    

Similar News