బైక్‌ కొనివ్వలేదని యువకుడి ఆత్మహత్య

ఎటు పోతుంది యువత ఆలోచానా శక్తి. పిల్లలని తల్లిదండ్రులను చిన్నప్పటి నుంచి అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసి వారు ప్రయోజకులయ్యాక తల్లిదండ్రులకు తోడుంటారనుకుంటారు. కానీ నేటి యువత వారి ఆశలని అడి ఆశలు చేస్తున్నారు. ప్రతి చిన్న విషయానికి మనస్తాపానికి గురై క్షణికావేశంలో తొందర పాటు నిర్ణయాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

Update: 2019-10-13 03:55 GMT

    చదువులో వెనుకేసుబడినా, ఫెయిల్ అయినా, అనుకుంది సాధించలేకపోయినా, వారు కోరుకున్నవస్తువులను తల్లి దండ్రులు కొనివ్వకపోయినా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ విధంగా రాష్ట్రం లో కానీ, దేశంలో కానీ చాలా మంది యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇదే కోణంలో బైక్‌ కొనివ్వలేదని మనస్తాపానికి గురైన ఒక యువకుడు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. దాంతో అతని తల్లిదండ్రులు చికిత్స కోసం హాస్పిటల్ కి తరలించారు. అయినా ఫలితం లేదు చేతికందొచ్చిన కొడుకు వారి కళ్ళముందే చికిత్స పొందుతూ మృతి చెందాడు.

     ఈ ఘటన గుమ్మడిదల గ్రామంలో చోటుచేసుకుంది. గుమ్మడిదల ఎస్సై రాజేశ్‌నాయక్‌ తెలిపిన వివరాల ప్రకారంగుమ్మడిదలకు సార అరవింద్‌కుమార్‌ గౌడ్‌ (20) శుక్రవారం ద్విచక్రవాహనం కొనివ్వాలని ఇంట్లో గొడవ పెట్టుకున్నాడు. వెంటనేకావాలని కోరడంతో కుటుంబ సభ్యులు అతనికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. దీంతో మనస్తాపానికి గురైన అరవింద్‌కుమార్‌ ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. కుటుంబ సభ్యులు గుర్తించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. శరీరంలో ఎక్కవ భాగం కాలిపోవడంతో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. అరవింద్‌కుమార్‌ తండ్రి రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

    చేతికందొచిన కొడుకు కళ్ళముందు చనిపోతే ఆ తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుందో, తల్లిదండ్రులు ఎంత కస్టపడి పిల్లలని సాకుతారో యువత ఒక్కసారి ఆలోచించండి. క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయాలు తీసికోకండి. మీ బంగారు భవిష్యత్తును పాడు చేసుకోకండి. 

Tags:    

Similar News