Talasani: కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకు వేయాలి..?
Talasani: కాంగ్రెస్ 40 సంవత్సరాలు అధికారంలో ఉండి.. ప్రజలకు ఏం చేశారో చెప్పే ధైర్యం ఉందా?
Talasani: కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకు వేయాలి..?
Talasani: కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ముషీరాబాద్, అంబర్ పేటలలో MLA అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. 130 సంవత్సరాల చరిత్ర ఉన్నకాంగ్రెస్ పార్టీ... 40 సంవత్సరాలు అధికారంలో ఉండి ప్రజలకు ఏం చేశారో చెప్పే ధైర్యం ఉందా అని సవాల్ విసిరారు. ఓటమి తప్పదనే భయంతోనే BJP రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పోటీ నుండి తప్పుకున్నారన్నారు.
రెండు సీట్లు గెలిచిన BJP బీసీ ముఖ్యమంత్రి ని ఎలా చేస్తారని ప్రశ్నించారు. కేంద్రమంత్రి గా పార్లమెంట్ నియోజకవర్గంలో కానీ అంబర్ పేట నియోజకవర్గంలో కానీ ఎన్ని నిధులు ఖర్చు పెట్టారో చెప్పాలన్నారు.మళ్ళీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది ముమ్మాటికీ BRS ప్రభుత్వమే అని..అన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు యధావిధిగా కొనసాగుతాయన్నారు.