టాలీవుడ్ పబ్‌పై వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ దాడులు.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా...

Tollywood Pub - Punjagutta: పోలీసుల అదుపులో 9 మంది యువతులు, 34 మంది యువకులు...

Update: 2021-12-11 09:43 GMT

టాలీవుడ్ పబ్‌పై వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ దాడులు.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా...

Tollywood Pub - Punjagutta: నోటీసులు ఇచ్చినా, దాడులు నిర్వహించినా నిర్వహకుల్లో మార్పే లేదు.. అర్థరాత్రి దాటిన తర్వాత కూడా అర్ధనగ్న డాన్సులు, మందు, చిందులతో విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. తాజాగా నిన్న అర్ధరాత్రి కూడా ఇదే సీన్ రిపీట్ అవ్వడంతో వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ దాడులు నిర్వహించి పబ్ గుట్టురట్టు చేసింది.

పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న టాలీవుడ్ పబ్‌ నిర్వహకులు మరోసారి రెచ్చిపోయారు. నిబంధనలకు విరుద్ధంగా సమయం దాటిన తర్వాత కూడా యువతీ యువకులతో అర్ధనగ్న డ్నాన్స్‌లు నిర్వహించారు. దీనిపై గతంలోనూ నోటీసులు ఇచ్చినా నిర్వహకుల తీరు మారలేదు.

దీంతో నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ దాడులు నిర్వహించి అర్ధనగ్న డాన్సులు చేస్తున్న 9 మంది యువతులు, 34 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. గతంలోనూ పబ్ నిర్వహకులు ఓ భార్యాభర్తలపై దాడి చేయడం కలకలం రేపింది.

Tags:    

Similar News