నేడు, రేపు ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు రేపు ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు రేపు ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆగ్నేయ మధ్యప్రదేశ్, తెలంగాణ, రాయలసీమ మీదుగా 1.5 కి.మీ ఎత్తుల ఉపరితల ద్రోణి తూర్పు బీహార్ నుంచి దక్షిణ ఇంటిరియల్ తమిళనాడు వరకు ఆవరించి ఉందని తెలిపారు. ఈ ఉపరితల ధ్రోని ప్రభావంతో ఆకాశం మేఘావృతమై రాష్ట్రంలో అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రంలో వడగండ్లు పడే అవకాశం ఉందని తెలిపారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొన్నారు. అక్కడక్కడ పిడుగులు కూడా పడే అవకాశం ఉందని, రైతులు చెట్ల కింద బయట ఉండకూడదని తెలిపారు. పంట నూర్పిడి చేసిన రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రైతులు అప్రమత్తమై పంటను కాపాడుకోవాలని సూచించారు.
ఇక రాష్ట్రంలో మొన్న కురిసిన అకాల వర్షం కారణంగా రైతులు ఎంతగానో పంటను నష్టపోయారు. ఈదురు గాలులతో తోటల్లోని మామిడికాయలు రాలి రైతులు తీవ్ర నష్టాప పాలయ్యారు. అలాగే వరి రైలుతు కూడా పంట తడవడంతో పంటను నష్టపోయారు.