Talasani Srinivas: వచ్చే నెల 2 నుంచి పేదలకు డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల పంపిణీ

Talasani Srinivas: ఈనెల 24తేదీన హైదరాబాద్ కలెక్టరేట్‌లో లక్కీడిప్

Update: 2023-08-20 03:10 GMT

Talasani Srinivas: వచ్చే నెల 2 నుంచి పేదలకు డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల పంపిణీ

Talasani Srinivas: హైదరాబాద్ పరిసరాల్లోని పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లను దశలవారీగా పంపిణీచేసేందుకుప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు. సెప్టెంబర్ 2 వ తేదీ నుండి GHMC పరిధిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీకి శ్రీకారం చుడుతున్నామన్నారు. డాక్టర్ BR అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని తన చాంబర్ లో GHMC కమిషనర్, కలెక్టర్ ల తో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ పై సమీక్షించారు. మొదటి విడతలో 8 ప్రాంతాలలో 12 వేల మంది అర్హులకు ఇండ్లను కేటాయిస్తామన్నారు. ఈ నెల 24 వ తేదీన హైదరబాద్ జిల్లా కలెక్టరేట్ లో డ్రా పద్దతిలో లబ్దిదారుల ఎంపిక చేయబోతున్నట్లు అధికారుల సమీక్షలో ప్రస్తావించారు.

Tags:    

Similar News