Revanth Reddy: కులగణన, ఎస్సీ వర్గీకరణపై రోడ్ మ్యాప్ అందించాం

Revanth Reddy: పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలకు నోటీసులు ప్రోసీజర్ లో భాగమేనని తెలంగాణ సీఎం ఎ.రేవంత్ రెడ్డి చెప్పారు.

Update: 2025-02-04 09:59 GMT

Revanth Reddy: కులగణన, ఎస్సీ వర్గీకరణపై రోడ్ మ్యాప్ అందించాం

Revanth Reddy: పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలకు నోటీసులు ప్రోసీజర్ లో భాగమేనని తెలంగాణ సీఎం ఎ.రేవంత్ రెడ్డి చెప్పారు. మంగళవారం అసెంబ్లీలోని తన కార్యాలయంలో ఆయన మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు. పార్టీ ఫిరాయించిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు ఇచ్చారు.

ఈ నోటీసులపై మీడియా ప్రతినిధుల ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. కులగణన, ఎస్సీ వర్గీకరణపై రోడ్ మ్యాప్ అందించామని ఆయన అన్నారు. కుల గణన చేయాలని ప్రధానమంత్రి మోదీపై కూడా ఒత్తిడి వస్తోందన్నారు. కులగణన చేసి చరిత్ర సృష్టించామన్నారు. అభివృద్ది ఫలాలు అందించాలనేది తమ ప్రభుత్వ ప్రయత్నమని ఆయన చెప్పారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేసిన సమగ్ర కుటుంబ సర్వే ఎక్కడ ఉందో తెలియదన్నారు.

ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ కు బాధ్యత లేదని సీఎం అన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ అసెంబ్లీకి రావాలని ఆయన కోరారు.

Tags:    

Similar News