భవనంలో ప్రకంపనలు...

సికింద్రాబాద్‌ ఎస్డీ రోడ్డులోని మినర్వా కాంప్లెక్స్‌లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో ఆ భవనం కూలిపోతుంది అంటూ అక్కడ ఉన్నవారందరూ పుకార్లు సృష్టించడంతో ఆ భవనంలో ఉన్నవారందరూ ఒక్క సారిగా భయభ్రాంతుకు గురయ్యారు.

Update: 2020-02-27 14:04 GMT

సికింద్రాబాద్‌ ఎస్డీ రోడ్డులోని మినర్వా కాంప్లెక్స్‌లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో ఆ భవనం కూలిపోతుంది అంటూ అక్కడ ఉన్నవారందరూ పుకార్లు సృష్టించడంతో ఆ భవనంలో ఉన్నవారందరూ ఒక్క సారిగా భయభ్రాంతుకు గురయ్యారు. ఎక్కడ భవనం కూలిపోతుందో అనుకుని తమ ప్రాణాలను అరచేతిలో పట్టుకుని భవనంలో ఉన్న కార్యాలయ సిబ్బంది వెంటనే భవనం నుంచి బయటికి పరుగులు తీసి బయటకు వచ్చి రోడ్డుపై నిలబడ్డారు. అంతే కాకుండా ఆ భవనం ఎప్పుడు కూలిపోతుందా అన్నట్టుగా దాన్నే గమనించుకుంటూ ఉండిపో బిల్డింగ్‌ వైపు చూస్తూ నిల్చున్నారు.

ఇక ఈ విషయం గురించి స్థానికుల్లో కొంత మంది పోలీసులకు, జీహెచ్చ్ ఎంసీ అధికారులకు సమాచారం అందించగా సంఘటనా స్థలానికి క్షణాల్లో చేరుకున్నారు. అనంతరం అక్కడి పరిస్థితి సమీక్షించారు. ఆ తరువాత భవనం కంపించడానికి గల కారణాలను వెల్లడి చేసారు. భవనం గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న బ్యాంక్‌ ఖాళీ చేస్తున్నారని అందులో ఉన్న లాకర్లను తరలిస్తుండగా భవనంలోని ఐదు అంతస్తులలో ప్రకంపనలు చోటుచేసుకున్నాయని అధికారులు తెలిపారు. దీంతో కార్యాలయాల సిబ్బంది, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. 

Tags:    

Similar News