కోదండరాంతో ఉత్తమ్ భేటీ

- ప్రొఫెసర్ కోదండరాంతో ఉత్తమ్ భేటీ - తార్నాకలోని కోదండరాం నివాసంలో భేటీ - హుజూర్ నగర్ అసెంబ్లీ ఉపఎన్నికలో... - కాంగ్రెస్‌ అభ్యర్థికి మద్దతు కోరిన ఉత్తమ్‌ - పార్టీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్న కోదండరాం

Update: 2019-09-22 11:15 GMT

హుజూరునగర్ ఉపఎన్నిక నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం రెడ్డితో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. తమ పార్టీ కార్యకర్తలకు నాయకులకు సమాచారం ఇవ్వకుండా ఉత్తమ్‌ ఒక్కరే తార్నాకలోని కోదండరాం నివాసానికి వెళ్లారు. టీఆర్ఎస్ వ్యవహరిస్తున్న తీరుపై ఇరువురు నేతలు చర్చించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై గంటసేపు వీరిద్దరు చర్చించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. హుజూర్ నగర్ అసెంబ్లీ ఉపఎన్నికలో కాంగ్రెస్‌కు మద్దతు కోరడానికి కోదండరాం ఇంటికి వచ్చానని ఆయన తెలిపారు. రాష్ట్రా స్థాయి కమిటీలు చర్చించి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. హుజూర్ నగర్ ఉపఎన్నికలో అందరూ కలిసి అధికారపార్టీని ఓడించాలని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News