నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాల అనుమతులు రద్దు

Update: 2019-11-14 07:31 GMT

అణు విద్యుత్ ఉత్పత్తిలో, అణ్వాయుధాల తయారీలో ఉపయోగించే యురేనియం నిక్షేపాలు నల్లమల అటవీ ప్రాంతంలోని కొన్ని గ్రామాల్లో ఉన్నట్టుగా సమాచారం అందుకున్న కొంత మంది యురేనియం నిక్షేపాల అన్వేషణ, తవ్వకాలకోసం అనుమతులను కోరారు. అటామిక్‌ మినరల్‌ డైరెక్టరేట్‌ (ఏఎండీ)కు అన్వేషణ, తవ్వకాలకు సంబంధించి 2016 డిసెంబర్‌లో తెలంగాణ స్టేట్‌ వైల్డ్‌ లైఫ్‌ బోర్డు సమావేశంలో అనుమతులు ఇచ్చారన్నారు. కానీ ఇప్పుడు వాటిని రద్దు చేశారు. నల్లమల అడవిలోని ఆమ్రాబాద్‌ పులుల అభయారణ్యం లో తవ్వకాలు జరిపి అడవికి నష్టం కలిగించకూడదని అటవీ శాఖ నిబంధనల్లో ఉండడం వలన దీన్ని రద్దు చేశామని వారు తెలిపారు. యురేనియం నిక్షేపాలను ఎలాంటి పరిస్థితుల్లో తీసేందుకు అనుమతించమని కౌన్సిల్‌లో మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ స్పష్టంచేశారు.

అయితే అటవీ శాఖ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి డ్రిల్లింగ్‌ చేయకుండా యురేనియం నిక్షేపాల అన్వేషణ చేపడతామంటూ ఏఎండీ నూతన ప్రతిపాదన సమర్పించినప్పటికీ. ఇప్పుడు ఈ ప్రతిపాదనలను కూడా రాష్ట్ర ప్రభుత్వం, అటవీ శాఖ వారు రద్దు చేసినట్టుగా వారు లేఖ ద్వారా వెల్లడించారు.

అటవీ ప్రాంతంలో తవ్వకాలు జరపడం వలన అడవిలో జీవించే జంతువులకు హాని కలుగుతుందని తెలిపారు. కానీ ఇప్పుడు ఈ అనుమతులను తొలగించినట్టు ఏఎండీ, కేంద్ర అటవీశాఖ, కేంద్ర వన్యప్రాణి బోర్డుకు తాజాగా లేఖల ద్వారా తెలియజేసారు.



Tags:    

Similar News